బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌‌‌‌గా  సుమిరన్ కొమర్రాజు

బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌‌‌‌గా  సుమిరన్ కొమర్రాజు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌‌‌‌గా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెందిన సుమిరన్ కొమర్రాజు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు సోషల్ మీడియా కో-కన్వీనర్లుగా కామారెడ్డి జిల్లాకు చెందిన ముదిత్ జైన్, వరంగల్ జిల్లాకు చెందిన సిద్దార్థ అనిశెట్టి, అలాగే టి. సాయి కిరణ్ గౌడ్‌‌‌‌లను నియమించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్‌‌‌‌గా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెందిన ప్రకాశ్ బాబును ఎంపిక చేశారు. ఐటీ విభాగ కో-కన్వీనర్లుగా రంగారెడ్డి రూరల్ జిల్లాకు చెందిన కుట్టారి వినోద్ కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెందిన కేశవ్ సోనిలు నియమితులయ్యారు.