నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

మణుగూరు, వెలుగు: ఎల్​నినో ప్రభావంతో రానున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆనకట్టపై ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసే పనుల పురోగతి, గోదావరి నీటి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వివరాలపై ఆరా తీశారు. అనంతరం పడవలో ప్రయాణిస్తూ ఆనకట్ట పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, ప్రజారోగ్యం, పశుసంపదపై ప్రభావం అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు అవసరమన్నారు. ఇంజినీరింగ్ అధికారుల సూచనల మేరకు ఆనకట్టపై సుమారు ఒక మీటర్ ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి దాదాపు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం రోజుకు 10 వేల నుంచి 15 వేల బస్తాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడంతో పాటు వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.