- మన్ కీ బాత్‌లో పాల్గొన్న బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు
మాదాపూర్, వెలుగు: దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’కార్యక్రమం 139వ ఎపిసోడ్‌లో భాగంగా ఆదివారం మియాపూర్ మయూరి నగర్ డివిజన్‌లోని లక్ష్మీ ఇంపీరియల్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శేరిలింగంపల్లి బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.
అవయవదానంపై అవగాహన, రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానం, ‘వోకల్ ఫర్ లోకల్’ప్రాధాన్యంపై మోదీ ఇచ్చిన సందేశాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రామచంద్రరావు అన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మియాపూర్ విద్యా కాలనీలో బీజేపీ నాయకుడు సమ్మెట ప్రసాద్ నివాసంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు.
