బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దాదా’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది.
గతంలో కాకినాడ పోర్టు పరిసరాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. అనంతరం సర్జరీ చేయించుకుని కోలుకున్న బాలయ్య, రీసెంట్‌గా తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టారు. అక్టోబరు మొదటి వారంలో మైసూర్‌లో జరిగిన షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ పరిసరాల్లో జరగనున్న తుది షెడ్యూల్‌పై మూవీ టీమ్ ఫోకస్ పెట్టింది.
2026 అక్టోబర్ 26 ( సోమవారం )నుంచి ప్రారంభంకానున్న ఈ షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ‘దాదా’ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లయింది. ఈ చివరి షెడ్యూల్‌లో బాలకృష్ణతో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటున్నారు.
ఇందులో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించనున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని తెలియజేశాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వీర సింహారెడ్డి’లాంటి హిట్ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
