అవకాశాలను చేజార్చుకున్నాం.. భారత్తో తొలి రెండు టీ20ల్లో ఓటమిపై న్యూజిలాండ్‌‌ కోచ్‌

అవకాశాలను చేజార్చుకున్నాం.. భారత్తో తొలి రెండు టీ20ల్లో ఓటమిపై న్యూజిలాండ్‌‌ కోచ్‌

కీలక సమయాల్లో విఫలమయ్యాం.. తిరిగి పుంజుకుంటాం


వెల్లింగ్టన్‌‌ : భారత్‌‌తో తొలి రెండు టీ20ల్లో కీలక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని న్యూజిలాండ్‌‌ హెడ్‌‌ కోచ్‌‌ రాబ్‌‌ వాల్టర్‌‌ తెలిపాడు. రెండు మ్యాచ్‌‌ల్లోనూ గెలిచే అవకాశాలున్నా.. చివర్లో పైచేయి సాధించలేకపోయామని ఆదివారం పేర్కొన్నాడు. రెండో టీ20లో 180 పరుగులు చేసినా నాలుగు వికెట్ల తేడాతో ఓడిన కివీస్‌‌.. తొలి మ్యాచ్‌‌లోనూ పరాజయం పాలైంది. ‘రెండు మ్యాచ్‌‌ల్లోనూ దాదాపు 80 శాతం సమయం బాగా ఆడాం. 

కానీ కీలక సందర్భాల్లో తప్పిదాలు చేశాం. నోబాల్‌‌, ఫీల్డింగ్‌‌ లోపాలు మాకు నష్టం కలిగించాయి’ అని వాల్టర్‌‌ చెప్పాడు. పవర్‌‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినా గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌, మార్క్‌‌ చాప్‌‌మన్‌‌ సహకారంతో 180 పరుగులు చేయడం సానుకూలమన్నాడు. కెప్టెన్‌‌ మిచెల్‌‌ శాంట్నర్‌‌ బౌలింగ్‌‌, నాయకత్వాన్ని ప్రశంసించాడు. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో మూడో టీ20 వెల్లింగ్టన్‌‌లో జరగనుంది. ఫాస్ట్‌‌ బౌలర్ల పనిభారాన్ని నిర్వహించేందుకు జట్టులో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించాడు.