మార్కెట్లకు చమురు సెగ! .. 117 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మార్కెట్లకు చమురు సెగ! .. 117 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఈ వారమే ఫెడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం అత్యంత కీలకం కానుంది. పెద్ద కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు,  ముడిచమురు ధరల కదలికలు మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్ణయించనున్నాయి.  బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 117 డాలర్లకు చేరడంతో ఈ వారం కూడా మార్కెట్లు నష్టాల్లో కదిలే అవకాశం ఉంది. దీనికితోడు ఈ నెల 28 న వెలువడనున్న ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.  

యూఎస్ బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరుగుతుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐల) భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.48 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీయంగా చూస్తే  టీవీఎస్ మోటార్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, సన్ ఫార్మా, బీఈఎల్, ఇండియన్ ఆయిల్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థల క్వార్టర్లీ ఫలితాలతో పాటు సెప్టెంబర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్  (ఐఐపీ) డేటా విడుదల కానుంది.

గత వారం సెన్సెక్స్ 1,605 పాయింట్లు, నిఫ్టీ 546 పాయింట్ల మేర కుప్పకూలిన నేపథ్యంలో.. బ్యారెల్ ముడిచమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడంతో  మార్కెట్లు పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.