గ్యాస్ సిలిండర్ డెలివరీపై క్లారిటీ.. సమ్మెకు దూరంగా డిస్ట్రిబ్యూటర్లు!

గ్యాస్ సిలిండర్ డెలివరీపై క్లారిటీ.. సమ్మెకు దూరంగా డిస్ట్రిబ్యూటర్లు!

న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్  సిలిండర్ల డోర్ డెలివరీకి ఎలాంటి అంతరాయం కలగదని ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు స్పష్టం చేశాయి. కమీషన్ల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారానికి  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ)  ఢిల్లీలో  అక్టోబర్ 26  నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి తాము దూరంగా ఉంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ), ఆల్ ఇండియా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (ఏఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్) సంస్థలు ఆదివారం ప్రకటించాయి.

గత ఐదేళ్లుగా నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ గ్యాస్ అమ్మకాలపై కమీషన్లు పెరగకపోవడం, నాన్-ఫ్యూయల్ ఉత్పత్తుల అమ్మకాలపై ఒత్తిడి వంటి అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపాయి. ఐఓసీ, బీపీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే  చర్చలు జరుపుతున్నామని, కమీషన్ల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని వెల్లడించాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వినియోగదారులకు నిరంతర గ్యాస్ సరఫరా అందిస్తామని భరోసా ఇచ్చాయి.