OTT Thriller: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. శవాన్ని పొడిచి చంపే సైకో కిల్లర్ కథ

OTT Thriller: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. శవాన్ని పొడిచి చంపే సైకో కిల్లర్ కథ

వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అసలు ఈ హత్యలకు కారణమెవరు? నేరస్తుడిని పట్టుకునే క్రమంలో పోలీస్ ఆఫీసర్‌కు ఎదురైన సవాళ్లేంటి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చూపిస్తూ వచ్చిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఎస్ఐ యుగంధర్’ (Si Yugandhar). ‘శంభాలా’ తర్వాత ఆది సాయికుమార్ నుంచి వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అక్టోబర్ 2 థియేటర్లోకి వచ్చింది. కానీ, సినిమా పెద్దగా ఎవరికీ తెలియకుండానే పోయింది. అయినప్పటికీ సినిమాలో క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలు ఉండటంతో.. ఆడియన్స్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘ఎస్సై యుగంధర్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వీకెండ్ స్పెషల్గా శుక్రవారం (అక్టోబర్ 30) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేఘలేఖ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరుస హత్యలు, మాయమైన శవం, సైకో కిల్లర్ చుట్టూ కథ సాగుతుంది. కేసు విచారణలో భాగంగా బయటపడే మెడికల్ మాఫియా లింకులు కథలో ఉత్కంఠను పెంచుతాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటీటీలో వీకెండ్ స్పెషల్ గా ఎంజాయ్ చేయొచ్చు.. 

కథేంటంటే:

హైదరాబాద్ నగర శివారులో ఓ మృతదేహం లభ్యం కావడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. మరోవైపు నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు పోలీసులకు సవాలుగా మారతాయి. ఈ కేసుల వెనుక ఓ మర్మమైన వ్యక్తి ఉన్నాడనే అనుమానంతో ఎస్ఐ యుగంధర్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. అయితే, విచారణ సాగుతున్న కొద్దీ కేసులో కీలకమైన మృతదేహం మాయమవడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తుంది. హత్యల వెనుక ఉన్నది ఎవరు? నిందితుడు పోలీసులను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాడు? ఈ కేసును ఛేదించే క్రమంలో యుగంధర్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనేవి కథలో ఉత్కంఠను పెంచే అంశాలు.

క్రైమ్, యాక్షన్, సస్పెన్స్‌తో సాగే ఈ కథలో దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. అనుమానితుల మధ్య అసలు నేరస్థుడిని గుర్తించి, కేసు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడమే యుగంధర్ ముందున్న ప్రధాన లక్ష్యం. ప్రదీప్ జూలూరు నిర్మించిన ఈ చిత్రానికి మార్కస్ ఎం సంగీతం అందించారు. వరుస హత్యలు, మాయమైన మృతదేహం చుట్టూ అల్లుకున్న మిస్టరీ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.