సుల్తాన్ పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ.. ఇవాళ(అక్టోబర్26) పరువు నష్టం కేసులో తీర్పు  

సుల్తాన్ పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ.. ఇవాళ(అక్టోబర్26) పరువు నష్టం కేసులో తీర్పు  

తనపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుల్తాన్ పూర్ ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు.2018లో బీజేపీ నేత అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలతో దాఖలైన ఫిర్యాదుతో కేసు విచారణ సాగుతుండగా.. ఈ కేసులో తుది తీర్పును సుల్తాన్ పూర్ ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు వెలువరించనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
 
2018మే లో  బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో   హోంశాఖ మంత్రి అమిత్  షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా కోర్టుకెక్కారు. ఈ కేసులో సుల్తాన్పూర్ ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేకంగా విచారణకు చేపట్టింది. రాహుల్ గాంధీ 2024ఫిబ్రవరి 20న బెయిల్ పొందారు. తుది వాదనలు ముగియడంతో ఇవాళ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించనున్న క్రమంలో దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

ALSO READ : యూపీలో రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం

ఇదిలా ఉండగా.. యూపీలోని  సుల్తాన్ పూర్  కోర్టుకు హాజరవుతుండగా.. రాహుల్ గాంధీ కాన్వాయ్ స్వల్ప ప్రమాదానికి గురయ్యింది. హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌వేపై సమీపంలో ఈ ప్రమాదం జరిగింది . ఎక్స్ ప్రెస్ వే పై 89.5 కిలోమీటర్ల మార్క్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్ ప్రెస్ వే పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంనుంచి రాహుల్ గాంధీ సేఫ్ గా బయటపడ్డారు.