యూపీలో రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం

యూపీలో రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం


లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపై కాన్వాయ్ లోని నాలుగు కార్లు , ఒక అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు.

2026 అక్టోబర్ 26న జరిగిన ఈ ప్రమాదంలో రాహుల్ గాంధీ  తృటిలో తప్పించుకున్నారు.  హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌వేపై   సమీపంలో ఈ ప్రమాదం జరిగింది . ఎక్స్ ప్రెస్ వే పై 89.5 కిలోమీటర్ల మార్క్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.   ఎక్స్ ప్రెస్ వే పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

2018 పరువు నష్టం కేసులో సుల్తాన్ పూర్ కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.  కాన్వాయ్ అధిక వేగంతో వెళ్తుండగా, ఒక కారు సడెన్ గా  బ్రేకులు వేయడంతో కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.   దీంతో వాహనాలు దెబ్బతిన్నాయి.    

ఘటనకు గల కారణాలను రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది, పోలీసులు విశ్లేషిస్తున్నారు.