షాకిస్తున్న ఐఫోన్ డ్యుయో.. వారం రోజులకే స్టోర్లకు కస్టమర్ల క్యూ

 షాకిస్తున్న ఐఫోన్ డ్యుయో.. వారం రోజులకే స్టోర్లకు కస్టమర్ల క్యూ

యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రీమియం ఫోన్, మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ రిలీజైన వారం రోజులకే కస్టమర్లకు షాకిస్తోంది. పలు టెక్నికల్ సమస్యలతో కస్టమర్లు స్టోర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.  విడుదయిన  కొద్ది రోజుల్లోనే  డిస్ప్లే సమస్యలు రావడంతో కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. 

స్క్రీన్‌ సమస్యలతో పాటు  ఫోల్డ్, ఓపెన్ (మడవడం లేదా తెరవడం) చేస్తున్న సమయంలో క్రంచ్ లేదా పాప్ శబ్దం వినిపిస్తుందని చెబుతున్నారు. అలాగే  స్క్రీన్‌పై పగుళ్లు లేదా బ్రైట్ లైన్స్ (గీతలు) కనిపించాయని చెబుతున్నారు. టియర్‌డౌన్ వెబ్‌సైట్ iFixit ఈ సమస్యలకు సాధ్యమైన కారణాలను గుర్తించింనట్లు పేర్కొంది. 

iFixit తన టియర్‌డౌన్‌లో హింజ్ డిజైన్‌కు సంబంధించి లోపలి డిస్‌ప్లే సమస్య ఉండవచ్చని తెలిపింది. టీమ్ టియర్‌డౌన్ ఫుటేజ్, పేటెంట్లు , సిటి స్కాన్‌ల ఆధారంగా 3డి హింజ్ మోడల్‌  నష్టాలను గుర్తించింది.  

  కారణం: 

రెండు కారణాలు ఉండవచ్చునని కంపెనీ పేర్కంది. ఒకటి ఫోన్ మూసేటప్పుడు సెంట్రల్ సపోర్ట్ బార్ తగినంతగా వెనక్కి వెళ్లకపోవడం. దీనివల్ల డిస్‌ప్లే కర్వ్ భాగం దానిపై ఒత్తిడి పడి, నష్టం జరిగిన ప్రాంతం దగ్గర ఒత్తిడి హాట్‌స్పాట్ ఏర్పడవచ్చునని చెబుతున్నారు.  

మరో అవకాశం హింజ్‌ను మూవ్ చేసే కర్వ్ రైల్స్. ఫోల్డింగ్ సమయంలో ఇవి పక్కన ఉన్న ఫ్లాట్ భాగాల కంటే పైకి లేచి స్క్రీన్‌ కు టచ్ కావచ్చు. ప్రభావిత ప్రాంతం దగ్గర అనేక స్ట్రక్చరల్ ఎడ్జ్‌లు కలుస్తున్నందున డిస్‌ప్లే  సన్నని పొరలపై ఒత్తిడి పెరవగచ్చు. గుర్తించదగినంతగా పగలకపోయినా స్క్రీన్  ఎలక్ట్రికల్ కనెక్షన్‌లలో స్థానిక లోపం వల్ల మొత్తం రో లేదా కాలమ్ పిక్సెల్స్ ప్రభావితం కావచ్చు. అయితే ఇవి ఖచ్చితమైన కారణాలు కాదని చెబుతున్నారు. 

ఈ సమస్యలు కేవలం కొన్ని కేసులకే పరిమితం అయి ఉండవచ్చని, చాలా మంది వినియోగదారులకు సమస్య కాకపోవచ్చని గమనించాలి. ఆపిల్ ఇలాంటి డిస్‌ప్లే సమస్యలు ఉన్నవారికి ఉచిత రీప్లేస్‌మెంట్ యూనిట్లు అందిస్తున్నట్లు సమాచారం. వారంటీ లేని సందర్భంలో లోపలి డిస్‌ప్లే రిపేర్ ఖర్చు రూ. లక్ష 49వేల 900 ఉంటుంది.

ఇండియాలో ఐఫోన్ డుయో బేస్ 256జీబీ వేరియంట్ ధర రూ. 2 లక్షల 99 వేల 900 నుంచి ప్రారంభమవుతుంది. 2టీబీ మోడల్ రూ. 4 లక్షల 49 వేల900 వరకు ఉంది. సప్లై సమస్యల కారణంగా కొన్ని రిటైలర్లు అధికారిక ధర కంటే అదనంగా రూ. 1 లక్ష అడుగుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి.