పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఈ యువకుడు ఓ ఉదాహరణ.. చదివింది మామూలు డిగ్రీనే.. కానీ ఏదో సాధించాలన్న అతని పట్టుదల, నిరంతర కృషి అతడిని ఆవిష్కర్తగా నిలబెట్టింది. 13 ఏళ్లు రాత్రింబవళ్లు కష్టపడి తన ప్రాంతంలోని ఎంతోకాలంగా ఉన్న రవాణా సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ ఫ్లయింగ్ కారును కనిపెట్టాడు. ఇటీవల ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన ఫ్లయింగ్ కారు మాదిరిగానే ఎగురుతుంది. ఎలాన్ మస్క్ ప్రపంచం మెచ్చిన టెక్ కంపెనీ ఓనర్ కాబట్టి అతని కారు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించాడు. కానీ ఈ యువకుడు సాధారణ టెక్నికల్ స్కిల్స్ తో డ్రోన్ వ్యవస్థను ఉపయోగించి ఈ కారును తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఉత్తరాఖండ్ కు చెందిన యువకుడు తయారు చేసిన ఎగిరే కారు ఇపుడు చర్చనీయాంశమైంది.
ఉత్తరాఖండ్ లోని అల్మోరాకు చెందిన రవి తమ్తా..13 ఏళ్లు కృషి, పట్టుదలతో ఓ ఎగిరే ఎలక్ట్రిక్ కారును డెవలప్ చేశారు.బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే చదివి రవి.. ఎలాంటి ఇంజనీరింగ్ విద్య లేకపోయినా అతని ప్రయాణం.. అవిష్కరణలకు అర్హత, అభ్యాసం వంటి సాంప్రదాయ భావనలకు సవాల్ చేస్తోంది.
రవి తమ్తా తయారు చేసిన ఒకే ఒక్క సీటు కలిగిన ఈ ఫ్లయింగ కారును అతను పనిచేస్తున్న హపిడా స్కైనెక్స్ సంస్థ టెస్టింగ్ దశను పూర్తి చేసింది. కేవలం క్లాస్ రూంలో చదువుకున్న చదవుతో కాకుండా క్లాస్ రూం అవల ఆలోచనలతో, సొంత తెలివి తేటలతో ఎలా ఆవిష్కరణ చేయొచ్చొ రవి తయారు చేసిన ఫ్లయింగ్ కారు స్పష్టం చేస్తుంది.
ఈ ప్లయింగ్ కారు ఆవిష్కర్త రవి తమ్తా..ఇంటర్నెట్ లో ఏళ్ల తరబడి ప్రయోగాలు, కుటుంబ సభ్యుల సపోర్టుతో .. ఉత్తరాఖండ్ లాంటి కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలపై దృష్టి సారించాడు. ఎప్పటికైనా ప్లయింగ్ కారును తయారు చేయాలని 13ఏళ్లు కష్టపడి ఈ ఆవిష్కరణను చేశాడు.
2015లో తన ప్రయోగాన్ని మొదలుపెట్టాడు ఈ యువ ఆవిష్కర్త. తాను పనిచేస్తున్న హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఆలోచనలకు రూపుదిద్దాడు. ఈ ప్లయింగ్ కారుకు ఎలాంటి రన్ వే అవసరం లేదు.. మల్టీ రోటర్ డ్రోన్ల మాదిరిగానే ఇది నిలువుగా టేకాఫ్ , ల్యాండింగ్ అవుతుంది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ మోటార్లు , ప్రొపెల్లర్ల ద్వారా దీనిని తయారు చేశారు.
ఈ మోడల్ లో లైట్ వెయిట్ ఫ్రేమ్, కాక్ పిట్, కానోపి ఉంటాయి. దీనికి విమానం ఇంధనం, ఇథనాల్ వంటి ఫ్యుయెల్స అవసరం లేకుండా బ్యాటరీతో నడుస్తుంది. అయితే, ఈ పరీక్షా ప్రయోగం ఓ ప్రారంభ మైలురాయి మాత్రమే..ఈ వెహికల్ ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి ఇంకా టైం పడుతుందంటున్నారు తయారీ దారులు.
Uttarakhand CM/minister may focus on these promising young men in Uttarakhand rather than spending time and public money on the likes of the singer who failed to take off on the stage. https://t.co/aMjS3Et8nV
— deepak upreti (@deekayu) October 23, 2026
