టాలీవుడ్‌లో మరో కొత్త సినిమా ప్రయాణం మొదలైంది. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలకు సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఓ యువ బృందం సిద్ధమైంది. డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం 'ప్రొడక్షన్ నంబర్ 1' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ దామోదర్ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శశాంక్ దువ్వూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే ఈ కథ మొదట్లో లైట్‌హార్టెడ్ ఎంటర్‌టైనర్‌లా సాగుతూ, ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుందని చిత్ర బృందం వెల్లడించింది. రొమాన్స్, వినోదం, భావోద్వేగాలతో పాటు బలమైన కాన్సెప్ట్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
నిర్మాత డాక్టర్ దామోదర్ నేరేళ్లకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ' సినిమా కోసం పాఠశాలకు వెళ్లకుండా వరంగల్ వెళ్లిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. గత 26 ఏళ్లుగా యూకే, అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన.. ఇప్పుడు తన చిరకాల కలను నిజం చేసుకుంటూ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
దర్శకుడు శశాంక్ దువ్వూరు గతంలో రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 'ఉల్టా' షార్ట్‌ఫిల్మ్‌ను కూడా రూపొందించారు. ఇప్పుడు తన తొలి సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
