Prabhas-Sandeep Reddy: "అన్నా.. లెట్స్ పార్టీ! ఇవాళ నీ బర్త్‌డే".. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ సెలబ్రేషన్స్!

Prabhas-Sandeep Reddy: "అన్నా.. లెట్స్ పార్టీ! ఇవాళ నీ బర్త్‌డే".. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ సెలబ్రేషన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ( అక్టోబర్ 23, 2026 ) సందర్భంగా ఆయన కొత్త సినిమాల నుంచి అప్‌డేట్స్ వస్తాయేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  సోషల్ మీడియా వేదికగా డార్లింగ్ కు  బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానుల్లో నెలకొన్న అంచనాల మధ్య సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ స్పెషల్ ఫొటోతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు నెట్టింట ఈ పిక్ వైరల్ అవుతోంది.

ప్రభాస్‌తో కలిసి 'స్పిరిట్' సెట్స్‌లో ఉన్న ఓ ఫొటోను సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అందులో సందీప్ చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని కనిపించగా, పక్కనే ఉన్న ప్రభాస్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నట్లు కనిపించాడు. ఈ ఫొటోకు "అన్నా.. లెట్స్ పార్టీ! ఇవాళ నీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్ అన్నా" అంటూ సందీప్ పెట్టిన క్యాప్షన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ ఫొటో అదనపు కిక్ ఇచ్చింది.

ఇక ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'స్పిరిట్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో తనదైన మేకింగ్ స్టైల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ఈసారి ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడనే సమాచారం కూడా గతంలో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

తీవ్రమైన భావోద్వేగాలు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో సందీప్ తనదైన ముద్ర వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ బర్త్‌డే  రోజుప్రభాస్‌తో సందీప్ పంచుకున్న ఈ సరదా క్షణం అభిమానులకు మాత్రం స్పెషల్ ట్రీట్‌గా మారింది. మరి ‘స్పిరిట్'నుంచి అసలైన ట్రీట్ ఎప్పుడు వస్తుందో చూడాలి...