వాస్తు ప్రకారం ఫ్రిజ్ ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది..?

వాస్తు ప్రకారం ఫ్రిజ్ ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది..?

మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా వాడుతున్న వస్తువుల్లో రిఫ్రిజిరేటర్.. అదేనండీ ఫ్రిజ్ ఒకటి. కూరగాయలు, పండ్లు, పాలు, వండిన ఆహారం.. ఇలా తినే తిండికి సంబంధించిన ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిజ్లో దాచుకుంటారు. అయితే.. ఈ ఫ్రిజ్ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడితే ప్రమాదాలకు అవకాశం ఉంది. వీలైనంత వరకూ కిచెన్ లోనే ఫ్రిజ్ ఉండాలి.

కుదరని పక్షంలో హాల్లో ఉంచుకోవాలి. ఫ్రిజ్ కోసం స్థలాన్ని ఎంచుకునేటప్పుడు, దాని పరిమాణం, తలుపు తెరవడంలో సౌలభ్యం, విద్యుత్ కనెక్షన్, వెంటిలేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో.. వాస్తు శాస్త్ర నమ్మకాలను పాటించి ఫ్రిజ్ ఏ దిశలో ఉంచడం ఉత్తమమో కూడా తెలుసుకోవాలని కొందరు భావిస్తుంటారు.

వాస్తు ప్రకారం.. ఫ్రిజ్ను ఇంట్లో పడమర దిశలో ఉంచడం శుభప్రదం. ఈ దిశ స్థిరత్వం, పురోగతికి సంబంధించిన కావడం వల్ల రిఫ్రిజిరేటర్‌ను పడమటి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, కుటుంబ శ్రేయస్సు పెరుగుతాయని ఒక నమ్మకం. అలా అని.. రిఫ్రిజిరేటర్‌ను ఒక నిర్దిష్ట దిశలో ఉంచడం వల్ల కుటుంబ ఆదాయం లేదా ఆనందం పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 

ALSO READ : జ్యోతిష్యం:శని త్రయోదశి..పారిజాతయోగం.. 

పడమర దిశలో స్థలం లేని ఇళ్లలో నైరుతి దిశలో కూడా ఫ్రిజ్ పెట్టుకోవచ్చని కొన్ని వాస్తు మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ దిశను స్థిరత్వం, బలానికి ప్రతీకగా భావిస్తారు. వాస్తు నమ్మకాలను పాటించాలనుకున్నప్పటికీ, రోజువారీ వినియోగానికి ఇబ్బంది లేకుండా.. ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి వీలుగా ఫ్రిజ్ ఉంచడం బెటర్.