బిహార్ లోని సివాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణ సంచా నిల్వ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం (అక్టోబర్23) జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో ముగ్గురి ఆచూకి కనిపించడం లేదు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అయితే మధ్య మధ్య లో పేలుళ్లు జరుగుతుండటంలో రెస్క్యూ చర్యలు ఆటంకం ఏర్పడింది.
పోలీసుల ప్రకారం.. సివాన్ నివాసి మహ్మద్ అమీరుద్దీన్ మియాన్ ఇంట్లో తయారీ యూనిట్ లో నిల్వఉంచిన బాణసంచాకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు, పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగినపుడు ఇంట్లోఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు మియాన్ కుటుంబసభ్యులు ఆచూకీ కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.
పేలుళ్ల ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యింది.దాదాపు రెండు గంటలపాటు పేలుళ్లు జరిగాయి. దీంతో చుట్టు ప్రక్కల వారంతా భయంతో పరుగులు పెట్టారు. పేలుళ్లలో కొన్ని మృతదేహాలు తీవ్రంగా ఛిద్రమైపయాయని వాటిని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఎంతమంది చనిపోయారనేది గుర్తించేందుకు ఓ వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకొని శాంపిల్స్ సేకరిస్తున్నట్లు స్థానిక ఎస్పీ సోని తెలిపారు
