500 కోట్ల రూపాయల ఆడియో క్లిప్ ఏంటీ.. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

500 కోట్ల రూపాయల ఆడియో క్లిప్ ఏంటీ.. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జరంగ్ పాటిల్ విడుదల చేసిన ఈ ఆడియో క్లిప్ తో  బీజేపీ అవినీతి, మోసపూరిత  కుట్ర బయటపడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఇలాంటి కుట్రపూరిత చర్యలతో  ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని రాజ్ థాకరే తీవ్రస్థాయిలో ఆరోపించారు. మరోవైపు  మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ పెద్ద కుట్ర చేస్తుందని ఈ ఆడియోను బయటపెట్టినమనోజ్ జరంగ్ పాటిల్ ఆరోపించడంతో మహారాష్ట్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

మహారాష్ట్ర రాజకీయాల్లో రూ. 500 కోట్ల పేమెంట్ ఆరోపణలకు సంబంధించిన ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 22, 2026న మరాఠా రిజర్వేషన్ల పోరాట నేత మనోజ్ జరంగే పాటిల్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు.  మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు మనోజ్ జరంగే పాటిల్‌ను కూల్ చేసేందుకు రూ. 500 కోట్లను సీఎం ఏకనాథ్ షిండేకు బీజేపీ ఇచ్చిందని, ఆ డబ్బును ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ అయిన డాక్టర్ శ్రీకాంత్ షిండే ద్వారా జరంగే పాటిల్‌కు చేరవేశారనేది ఆ క్లిప్ లోని  సారాంశం. 

 దాదాపు 29 నిమిషాల ఈ ఆడియో సంభాషణలో ఓ మహిళా బీజేపీ లీడర్, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ప్రతినిధి,కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మధ్య  ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ రాజకీయ వ్యూహాలు ,500 కోట్ల రూపాయల లావాదేవీల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే, తనకు ఎటువంటి డబ్బు అందలేదని, తన ఉద్యమం అణిచివేతకు జరుగుతున్న కుట్రలను బయటపెట్టేందుకు ఈ ఆడియోను విడుదల చేశానని జరంగే స్పష్టం చేశారు. 

ఈ ఆడియోపై స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియాపై ఒత్తిడి తెస్తూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు మతపరమైన విభజనను వాడుకుంటూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుందన్నారు. ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ నివేదిక కోరానని చెబుతూ సీఎం కాలయాపన చేస్తున్నారని థాకరే అన్నారు

ఇక ఈ ఆడియో క్లిప్ పై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూనే సమగ్ర ఫోరెన్సిక్, సైబర్ విచారణకు ఆదేశించారు. ఆడియో క్లిప్ రెండున్నరేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నాం..ఈ క్లిప్ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు బయటకు వచ్చింది..దీని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటనే కోణంలో విచారణ జరుపుతామని చెప్పారు.