ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..పార్టీ శ్రేణులకు BJP ఎంపీ లక్ష్మణ్ పిలుపు

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని  తిప్పికొట్టాలి..పార్టీ శ్రేణులకు BJP ఎంపీ లక్ష్మణ్ పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు: సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 2న హైదరాబాద్​లో ‘లోక్‌‌‌‌‌‌‌‌ తంత్ర బచావో.. భీడ్ తంత్ర హటావో’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. 

సోమవారం ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్  జీర్ణించుకోలేకపోతుందన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేకే మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. 

పాట్నా సభలో మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం కలిగిన ఖర్గే లాంటి వ్యక్తి.. వ్యక్తిగతంగా దూషించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 

దేశ రాజకీయాల్లో అరాచకత్వాన్ని సృష్టిస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే 30 ఏండ్ల వరకు దేశంలో ఇతరులకు అవకాశం లేదన్నారు. బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్ రాజకీయాలకు ప్రజలు తలొగ్గరని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచు
కోవాలని హితవు పలికారు.