జైలు నుంచి పారిపోయిన 17 మంది ఖైదీలు.. తమిళనాడు తెక్కంపట్టి సబ్ జైలులో ఘటన 

జైలు నుంచి పారిపోయిన 17 మంది ఖైదీలు.. తమిళనాడు తెక్కంపట్టి సబ్ జైలులో ఘటన 

తమిళనాడులోని తెక్కంపట్టి సబ్ జైలు నుంచి 17మంది ఖైదీలు పారిపోవడం కలకలం రేపింది. అక్టోబర్ 26 సోమవారం రాత్రి ఒకే సెల్‌లో ఉంచిన 17 మంది ఖైదీలలో ఒకరికి మూర్చ వచ్చిందని నమ్మించి జైలు గార్డులను సెల్ లోకి వచ్చేలా చేసి ఖైదీలు వారిపై అటాక్ చేసి తప్పించుకున్నారు. ఈ ఘటనలో గ్రేడ్ II పోలీస్ కానిస్టేబుల్ తంగపాండితోపాటు మరో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్సకోసం కానిస్టేబుల్ ను జి విళక్కులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ALSO READ : హైదరాబాద్లో నాలుగు చోట్ల పేలుడు శబ్దాలు.. పరుగులు తీసిన స్థానికులు

పారిపోయిన ఖైదీల్లో ప్రవీణ్ కుమార్, సిలంబరసన్, రాజా సికందర్, రాజ్‌కుమార్‌లతో సహా పలువురిని తిరిగి పట్టుకోగా, మిగిలిన పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిపోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దిండిగల్‌లో 16 చెక్‌పోస్టు, కేరళ సరిహద్దు సమీపంలోని (ఇడుక్కి జిల్లా) బృందాలను అప్రమత్తం చేయడంతోపాటు పలు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.