మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ కు రూ. 500 కోట్లు ముట్టాయంటూ వైరల్ అయిన ఆడియో క్లిప్ వివాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు 3 మంది సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేశారు. అడిషనల్ సీపీ సౌత్ రీజియన్ శైలేష్ బాల్కవాడే నేతృత్వంలో సిట్ బృందం దర్యాప్తు కొనసాగించనుంది.
ఇటీవల జరాంగే పాటిల్ విడుదల చేసిన ఆడియో క్లిప్ మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీజేపీ,దాని మిత్రపక్షమైన శివసేన మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఆ ఆడియోలో 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, ఏక్నాథ్ షిండేకు రూ. 500 కోట్లు ఇచ్చిందని ఆ డబ్బును మరాఠా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే ద్వారా జరాంగే పాటిల్‌కు కూడా రూ. 500 కోట్లు ఇచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి స్వీతా శాలిని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ALSO READ ; జైలు నుంచి పారిపోయిన 17 మంది ఖైదీలు..
ఏక్నాథ్ షిండే, శ్రీకాంత్ షిండే ,మనోజ్ జరాంగే పాటిల్ ఈ ఆరోపణలను ఖండించారు. అసలు ఈ ఆడియో వెనుక ఉన్న నిజానిజాలు తేల్చాలని వారే స్వయంగా విచారణ కోరారు. ఈ ఆడియో క్లిప్ నిజమైనదా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టినా లేదా ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో సైబర్ ,ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
