ట్రెండింగ్: కంకర రాళ్లలో ఇయర్ బడ్ పోగొట్టుకున్నాడు.. చాట్ జీపీటీ వెతికి పెట్టింది!

ట్రెండింగ్: కంకర రాళ్లలో ఇయర్ బడ్ పోగొట్టుకున్నాడు.. చాట్ జీపీటీ వెతికి పెట్టింది!


చాట్ జీపీటీని ముఖ్యంగా ఏఐని మామూలుగా వాడటం లేదబ్బా మనోళ్లు. ఏ డౌట్ వచ్చిన ఏఐ.. చివరికి సొంతంగా ఆలోచించడమే మానేసే పరిస్థితి. అయితే ఇతడు మాత్రం కరెక్టుగా వాడిండని..  సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాడు. కంకర రాళ్లలో పోగొట్టుకున్న ఇయర్ బడ్ ను చాట్ జీపీటీ వెతికి పెట్టడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. 

ఒక వ్యక్తి చాట్ జీపీటిని వాడుకున్న విధానాన్ని షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కొడుకుతో పార్కుకు వెళ్లిన వ్యక్తి.. తిరిగి వెళ్లే క్రమంలో కొడుకు తన మాట వినకుండా పరిగెత్తడం గమనించాడు. కొడుకు వెంట పరిగెత్తే క్రమంలో తన ఇయర్ బడ్ పోయింది. దీంతో దాదాపు పది నిమిషాలు వెతికి అలసిపోయాడు. 

  రాళ్ల రంగులో ఉండే ఇయర్ బడ్ ను దొరికించుకోవడం కష్టమైంది అతనికి. వెంటనే చాట్ జీపీటిని హెల్ప్ అడిగాడు. అది వెతికి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఒకవైపు కొడుకు కూర్చొని వెయిట్ చేస్తున్నాడు.. ఇలాంటి పరిస్థితుల్లో వెతకడం కష్టంగా మారింది. 

కంకరలో వెతికే బదులు ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీసి ఛాట్ జీపీటీలో అప్లోడ్ చేశాడు. మిస్సింగ్ అయిన ఇయర్ బడ్ ను వెతికి పెట్టాల్సిందిగా చాట్ బాట్ ను కోరాడు. అయితే మరింత క్లోజ్ గా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిందిగా ఏఐ అడిగింది. 

ఏఐ అడిగినట్లు మరిన్న ఫోటోలు తీసి అప్లోడ్ చేశాడు . ఫోటోలు ఇచ్చిన నిమిషంలోనే చాట్ జీపీటీ ఫోటోలను వెతికి ఇయర్ బడ్ ఉన్న స్థలాన్ని గుర్తించింది. 

దీనికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు, నమ్మలేకపోతున్నాను, అది నిజంగానే దాన్ని వెతికి గుర్తించిందని  ఎక్స్ లో పోస్టు్  చేశారు.  ChatGPT సహాయం లేకుండా తాను ఇయర్ బడ్ ను వెతకడం కష్టమయ్యేదని సదరు వ్యక్తి తెలిపారు.