ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ వివో (Vivo) చైనాలో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. వివో Y600 అనే పేరుతో ఈ ఫోన్ ని కంపెనీ పరిచయం చేసింది. దీనిలోని అతిపెద్ద ఆకర్షణ భారీ 10,000 mAh బ్యాటరీ. ఈ పెద్ద బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డును సంపాదించి పెట్టింది.
సమాచారం ప్రకారం, ఆగస్టులో నిర్వహించిన ఓ టెస్ట్ లో ఈ ఫోన్ 32 గంటల 37 నిమిషాల పాటు బ్రేక్ లేకుండా వీడియో స్ట్రీమ్ చేయగలిగింది. దీనికి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కంపెనీ దీనిని స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేసింది.
వివో Y600 ధర
ధరల విషయానికి వస్తే, చైనాలో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ వివో Y600 ధర 1,999 యువాన్లు (సుమారుగా రూ. 28,450). 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లు (సుమారుగా రూ. 29,875).
6GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 2,199 యువాన్లు (సుమారుగా రూ. 31,280) కాగా, 8GB RAM + 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర 2,499 యువాన్లు (సుమారుగా రూ. 35,560). ఇండియాలో ఈ ఫోన్ విడుదల లేదా లభ్యత గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
వివో Y600 స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, వివో Y600లో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 10-బిట్ కలర్ అవుట్‌పుట్‌ను కూడా అందిస్తుంది. ఈ స్పెసిఫికేషన్లు వీడియోలు చూసేటప్పుడు, స్క్రోల్ చేసేటప్పుడు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
పర్ఫార్మెన్స్ కోసం, మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌తో పాటు LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇంకా ఆండ్రాయిడ్ ఒరిజిన్ ఓఎస్ 6 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
వివో Y600 కెమెరా
ఫోటోగ్రఫీ కోసం, f/1.8 అపర్చర్‌తో 50MP బ్యాక్ కెమెరా... ముందు వైపు, సెల్ఫీలు ఇంకా వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే 44W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000mAh బ్యాటరీ ఉంది.
ఈ ఫోన్ USB టైప్-సి పోర్ట్ ద్వారా రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది, అవసరమైతే ఇతర ఫోన్లను ఛార్జ్ చేయడానికి వీలు ఉంటుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, బ్లూటూత్ 5.4, NFC, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
