అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్...ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు...

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్...ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఉమ్మడి కృష్ణా జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో మంగళవారం, బుధవారం ( అక్టోబర్ 27, 28 ) ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అర్నబ్ తుఫాను విశాఖకు 610 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని... మంగళవారం అతి తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపారు అధికారులు. బుధవారం ఉదయానికి బాపట్ల-విశాఖ మద్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

►ALSO READ | ప్రళయంగా తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నబ్ తుఫాన్

అర్నబ్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని.. ఇదివరకే వేటకు వెళ్ళినవారు ఉంటే వెంటనే వెనక్కి రావాలని హెచ్చరించారు అధికారులు. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.