CSK బ్యాటింగ్ కోచ్‎గా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్.. ఈసారి అస్సామే అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్..!

CSK బ్యాటింగ్ కోచ్‎గా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్.. ఈసారి అస్సామే అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్..!

ఫైవ్‎టైమ్స్ ఐపీఎల్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ 2027 సీజన్‎ కోసం తమ కోచింగ్ స్టాఫ్ నియామకాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పటికే హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‎లను అపాయింట్ చేసుకున్న సీఎస్కే తాజాగా బ్యాటింగ్ కోచ్ నియామకాన్ని భర్తీ చేసింది. చెన్నై బ్యాటింగ్ కోచ్‎గా ఇంగ్లాండ్ మాజీ స్పి్న్నర్, సర్రే హెడ్ కోచ్ గారెత్ బాటీ నియమితులయ్యారు. మైఖేల్ హస్సీ స్థానంలో గారెత్ బాటీ సీఎస్కే బ్యాటింగ్  కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

బాటీ తన కెరీర్‌లో స్పిన్నర్‌గా రాణించినప్పటికీ కోచ్‌గా అతనికున్న అపారమైన అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యాల కారణంగా సీఎస్కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, ఒక స్ని్న్నర్‎ను బ్యాటింగ్ కోచ్‎గా తీసుకోవడంతో చెన్నై అభిమానులు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. ఈసారి కూడా టైటిల్ అస్సామే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ లో మోస్ట్ ఫేవరెట్ టీముల్లో సీఎస్కే ఒకటి. ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఈ జట్టు భారత మాజీ క్రికెటర్ ధోని సారథ్యంలో ఓ వెలుగు వెలిగింది. గత కొన్ని సీజన్లుగా చెన్నై ప్రదర్శన దారుణంగా తయారైంది. బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్ గెలిచి ఆ జట్టు కనీసం ప్లే ఆఫ్స్‎కు కూడా చేరకుండానే ఇంటి బాట పడుతోంది. 

ఈ నేపథ్యంలో జట్టును, కోచింగ్ సిబ్బందిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎస్కే మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే కోచింగ్ స్టాఫ్‎ను పూర్తిగా మార్చేసింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో భారత మాజీ పేస్ దిగ్గజం జహీర్ ఖాన్‎ను సీఎస్కే హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ చెన్నై బౌలింగ్ కోచ్‎గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్ కోచ్‎గా గారెత్ బాటీ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

గారెత్ బాటీ ట్రాక్ రికార్డ్:

గారెత్ బాటీ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా ఆఫ్-స్పిన్ బౌలరైన బాటీ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 10 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడారు. జాతీయ జట్టు తరుఫున కొన్ని మ్యాచులే ఆడిన బాటీకి ఇంగ్లండ్ డొమెస్టిక్ (కౌంటీ) క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 261 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 682 వికెట్లు పడగొట్టారు.

ఇంటర్నేషనల్ క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గారెత్ బాటీ కోచ్ అవతారమెత్తాడు. ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక కౌంటీ క్లబ్ సర్రే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. బాటీ నేతృత్వంలో సర్రే జట్టు వరుసగా మూడు సార్లు కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెల్చుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు అయిన విల్ జాక్స్, ఒల్లీ పోప్, జేమీ స్మిత్, గుస్ అట్కిన్సన్ వంటి ఎందరో యువ ప్లేయర్లను జాతీయ జట్టుకు అందించడంలో బాటీ కీ రోల్ ప్లే చేశారు. 

ALSO READ : టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టీ20కి స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దూరం

యంగ్ టాలెంట్‌ను గుర్తించి వారిని మరింత రాటుదేల్చడంలో అతడి దిట్ట. సీఎస్కే నూతన హెడ్ కోచ్ గా ఎంపికైన భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‎తో బాటీకి మంచి సంబంధాలు ఉన్నాయి. జహీర్ ఖాన్ గతంలో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో వోర్సెస్టర్‌షైర్ జట్టు తరఫున బాటీతో కలిసి ఆడారు.