టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టీ20కి స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దూరం

టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టీ20కి స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దూరం

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‎తో జరగనున్న మూడో టీ20కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత్ స్టార్ ప్లేయర్, ఇన్‎ఫామ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడో టీ20కి దూరమయ్యాడు. ఈ సిరీస్‎లోని తొలి మ్యాచులో గాయపడ్డ ఇషాన్ కోలుకోకపోవడంతో మూడో టీ20కి కూడా అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. 

అతడి స్థానంలో కుమార్ కుశాగ్రను ఎంపిక చేసినట్లు తెలిపింది. కుడి అడక్టర్ కండరాల గాయం నుంచి ఇషాన్ త్వరగా కోలుకుంటున్నాడని పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్య పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపింది. 

అతని పునరాగమనాన్ని వేగవంతం చేయకుండా గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలనే ఇషాన్‎ను మూడో టీ20కి పక్కన పెట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. రెండో టీ20లో ఇషాన్ స్థానంలో బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నాలుగు బంతుల్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అంచనాల మేర రాణించలేకపోయాడు.

న్యూజిలాండ్, ఇండియా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరగుతోన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‎లోని తొలి రెండు మ్యాచుల్లో అతిథ్య జట్టును ఓడించి 2-0 తేడాతో అయ్యర్ సేన ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో ఊపుమీదున్న అయ్యర్ సేన మూడో టీ20లో కూడా విజయం సాధించి మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.