మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య కేసులో కీలక పరిణామం... పనిమనిషి కల్పన సహా నలుగురు అరెస్ట్..

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య కేసులో కీలక పరిణామం... పనిమనిషి కల్పన సహా నలుగురు అరెస్ట్..

హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నేపాలీ పనిమనిషి కల్పన సహా మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ( అక్టోబర్ 26 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీపీ సజ్జనార్. ఈ కేసుకు సంబంధించి ఇతర కమిషనరేట్లలో జరిగిన నేరాలపై ఆరా తీసి.. ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు.

హైదరాబాద్ లో ఉంటున్న నేపాలీయులపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ద్వారా విచారణ చేపట్టామని.. ముంబై, పూణే, వంటి ప్రాంతాల్లో గాలింపు చేపట్టామని అన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేశామని.. నిందితులు, కల్పనతో పాటు ముగ్గురు, గణేష్, చందర్, గణేష్ బాద్రు లను అరెస్టు చేశామని..మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. 

జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో మే 8 అర్థరాత్రి రాత్రి తనూజ రంజాన్ ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న కల్పనతో కలిసి ముఠా సభ్యుల కుట్ర పన్నారని తెలిపారు పోలీసులు. తనూజ రంజన్ చేతులు కట్టి, నోటిలో గుడ్డ కుక్కి ఊపిరాడకుండా హత్య చేశారు. హత్య అనంతరం 225 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల దోపిడీ చేశారు. యజమానురాలి ఇంట్లో విలువైన వస్తువుల వివరాలను పనిమనిషి కల్పన తన ముఠాకుచేరవేసిందని.. యజమానురాలు బెంగళూరుకు వెళ్లిన విషయాన్ని ముఠా సభ్యులకు చేరవేసిందని తెలిపారు పోలీసులు.

పూణేలో హత్యకు ప్లాన్..

ఈ క్రమంలో కల్పన పూణెలో ముఠాతో సమావేశమై హత్య, దోపిడీకి పక్కా ప్రణాళిక రచించిందని తెలిపారు. రెండు బృందాలుగా విడిపోయి హత్య, దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు. కల్పన తనూజ రంజన్ ను హత్య చేసిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని ముఠా సభ్యులను కలిసిందని తెలిపారు. వరంగల్‌ వైపు వెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో దోపిడీ సొత్తును తొమ్మిది వాటాలుగా పంచుకున్నారని.. పోలీసులకు చిక్కకుండా మూడు బృందాలుగా విడిపోయి నేపాల్‌కు పరారయ్యారని తెలిపారు.

►ALSO READ | మాదాపూర్ లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలు అరెస్ట్...

నిందితుల కోసం ఐదు నెలలు వేట:

నిందితుల కోసం ఐదు నెలల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందంతో వేట కొనసాగించమని.. బెంగళూరు, ముంబై, పుణె, సూరత్, పాట్నా, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టామని తెలిపారు. భారత్‌–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచామని.. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుల కదలికలపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు పోలీసులు.

మే 22న సునీల్ బహదూర్ పరియార్, దోపిడీ సొత్తు స్వీకరించిన దిలీప్ బహదూర్ మిజార్ లను అరెస్ట్ చేశామని.. అప్పట్లో నిందితుల నుంచి 26 గ్రాముల బంగారు ఆభరణాల రికవరీ చేశామని..అక్టోబర్ 26న నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. తాజాగా పట్టుబడిన నిందితుల నుంచి రూ.51,130 నగదు, ఇతర ఆధారాల స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.