మాదాపూర్ లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలు అరెస్ట్...

మాదాపూర్ లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలు అరెస్ట్...

మాదాపూర్ లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ( అక్టోబర్ 26 ) మాదాపూర్ లో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలను అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ ఎసఓటీ పోలీసులు. ముగ్గురు మహిళల్లో ఇద్దరి దగ్గర మాత్రమే పాస్ పోర్ట్ ఉన్నట్లు తెలిపారు పోలీసులు. మిగిలిన ఇద్దరి దగ్గర గుర్తింపు పత్రాలు లేనట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.

ALSO READ : మన ఇంట్లో అన్నం తినే స్టీల్ ప్లేట్.. కొత్త కొత్త పేర్లతో ఐకియాలో రూ.800కు అమ్మేస్తున్నారు..!

పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు మహిళలు తొలుత నేపాల్‌కు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు  విచారణలో వెల్లడైనట్లు తెలిపారు పోలీసులు. ముగ్గురు మహిళలను మాదాపూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు ఎస్‌ఓటీ పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.