సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాత వస్తున్న ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ చిత్రం ' ధర్మన్'. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికే రజనీ క్రేజ్‌తో అంచనాలు పెంచుకున్న ఈ సినిమాకు నయన్ రాకతో మరింత హైప్ తీసుకొచ్చింది. ఇద్దరు స్టార్‌లు మరోసారి ఒకే తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది. "ది ఆరా ఈజ్ డబుల్.. వెల్‌కమింగ్ ది వన్ అండ్ ఓన్లీ నయనతార టు ధర్మన్" అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే సినిమాలో నయనతార పాత్ర ఏమిటి? ఆమెది పవర్‌ఫుల్ రోలా, కథను మలుపు తిప్పే కీలక పాత్రా? అనే విషయాలపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
రజనీకాంత్, నయనతార గతంలో 'చంద్రముఖి', 'కథానాయకుడు', 'దర్బార్', 'పెద్దన్న' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ముఖ్యంగా 'అన్నాత్తే' తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపైకి వస్తుండటంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు, కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో నయనతార పనిచేయడం కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది.
ALSO READ : ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..
'ఓ మై కడవులే', 'డ్రాగన్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా, శ్రీలీల కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాటోగ్రఫీని నికేత్ బొమ్మిరెడ్డి నిర్వహిస్తుండగా, స్టంట్ కొరియోగ్రఫీ బాధ్యతలను అన్బరివ్ చేపట్టారు.
ఇప్పటికే పలు షూటింగ్ షెడ్యూళ్లు పూర్తయ్యాయి. పొంగల్ 2027కు విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారిక విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. రజనీ మాస్ ఇమేజ్, నయన్ స్టార్‌డమ్, అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే 'ధర్మన్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
THE AURA IS DOUBLE Welcoming the one and only #Nayanthara to DHARMAN #Dharman #KettaPaiyanSir #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran #Nayanthara @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc #RaashiKhanna @nikethbommi #KarthikRajkumar @PradeepERagav @kabilanchelliah @ShruthiManjari @APIfilms @homescreenent @saregamasouth @RKFI @turmericmediaTM @magizhmandram
— Raaj Kamal Films International (@RKFI) October 25, 2026
