RashmikaVijay: "నా ప్రేమ నా ఇష్టం!".. ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!

RashmikaVijay: "నా ప్రేమ నా ఇష్టం!".. ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల లవ్ స్టోరీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఇటీవల ఒక షోలో విజయ్‌ను పెళ్లి చేసుకోవాలని 100 సార్లు అడిగానని రష్మిక చెప్పడం నెట్టింట పెద్ద రచ్చకు దారితీసింది. ముఖ్యంగా కొందరు మహిళా నెటిజన్లు రష్మికను దారుణంగా ట్రోల్ చేస్తూ, ఆమె ఆత్మగౌరవాన్ని తగ్గించుకుందంటూ కామెంట్లు చేశారు. ఈ అనవసర వివాదాలపై నేషనల్ క్రష్ గట్టిగానే రియాక్ట్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెడుతూ హేటర్స్ నోళ్లు మూయించింది. "నేను నా మనిషి ప్రేమలో పిచ్చిగా మునిగిపోయాను. నా ప్రేమలో పడితే తప్ప పెళ్లి దాకా ఎందుకు వెళ్తాను? ఒక 100 సార్లు అడగడం ఏంటి.. నా విజయ్ కోసం వెయ్యి సార్లు అయినా పెళ్లి ప్రతిపాదన తెస్తాను. పెళ్లయ్యాక కూడా అతడినే మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లంటే మోకాళ్లపై నిలబడి రింగ్ తొడగడం కాదు.. ఇద్దరం కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం. నా ప్రేమ మీ ఊహలకు సరిపోకపోతే అది మీ సమస్య" అంటూ తన ప్రేమని చాటుకుంది. 

అంతేకాదు, "నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలిచింది విజయ్ మాత్రమే తప్ప.. ఇక్కడ కామెంట్లు చేసేవారు కాదు" అని తెగేసి చెప్పింది రష్మిక. ఇంటర్నెట్‌లో వచ్చే తప్పుడు కథనాలను, ఫేక్ ఎడిట్‌లను నమ్మే వారిపై అసహనం వ్యక్తం చేసింది.  ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే... ఎవరో మీద పడి అరుస్తున్నట్లు, కేవలం కక్ష తీర్చుకోవడానికి తిరుగుతున్న ఆగ్రహావేశాల గుంపులా కనిపిస్తోంది.   అసలు పాయింట్ పక్కదారి పట్టింది. మా ఇంటర్వ్యూలోని కొన్ని మాటలను పట్టుకుని ఏడాది పొడవునా అదే పనిగా చర్చించుకుంటున్నారంటూ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ALSO READ : 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి కంగనా రనౌత్..

చివరగా ఫెమినిజం గురించి నీతులు చెప్పే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ.. "నాపై ఎంతైనా విషం చిమ్మండి, నేను భరిస్తాను. కానీ నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని లాగొద్దు. ఒకరిని కిందకు దించడం ఫెమినిజం అనిపించుకోదు. మన జీవితాన్ని మనకు నచ్చినట్లు జీవించే స్వేచ్ఛే నిజమైన ఫెమినిజం" అని కుండబద్దలు కొట్టింది. రష్మిక ఇచ్చిన ఈ బోల్డ్ అండ్ క్రేజీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.