రాష్ట్రపతి భవన్ సమీపంలోని సెక్రటేరియట్ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం

రాష్ట్రపతి భవన్ సమీపంలోని సెక్రటేరియట్ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సమీపంలోని సెంట్రల్ సెక్రటేరియట్ నార్త్ బ్లాక్‎లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం (అక్టోబర్ 26) ఉదయం నార్త్ బ్లాక్ భవనంపై మరమ్మతులు, పాత సామాగ్రి తొలగింపు పనులు జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది.

వెంటనే అప్రమత్తమైన సెక్రటేరియట్ సిబ్బంది ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‎కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. 

ALSO READ : ఫలించిన విద్యార్థుల పోరాటం

షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక కార్యాలయాలు ఉండే ఈ భవనంలో మంటలు సకాలంలో అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.