అస్సలు మందు తాగకుండా ఉండటం కన్నా... లిమిట్ గా తీసుకుంటే మంచిదా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

అస్సలు మందు తాగకుండా ఉండటం కన్నా... లిమిట్ గా తీసుకుంటే మంచిదా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా చాలామంది తాగుతుంటారు. అప్పుడప్పుడూ పార్టీల్లో తాగేవారు కొంతమంది అయితే, రోజూ తాగేవారు మరికొంతమంది ఉంటారు. రోజూ తాగడం మంచిది కాదని ఎవరిని అడిగినా చెబుతారు. అప్పుడప్పుడు లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని... డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారని కొంతమంది చెబుతుంటారు. ఈ వాదనలో నిజమెంతుంది..? అస్సలు మందు తాగనివారి కంటే అప్పుడప్పుడూ లిమిట్ గా తీసుకుంటే మంచిదా...? ఈ విషయంపై డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకున్నా, లిమిట్ గా తీసుకున్నా కూడా ప్రమాదమేనని అంటున్నారు డాక్టర్లు. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ ఇలా ఏ రూపంలో తీసుకున్నా కూడా శరీరానికి మంచిది కాదని అంటున్నారు డాక్టర్లు. లిమిట్ గా మందు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అన్న వాదన పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు.
  
శరీరంపై మద్యం ప్రభావం:

బీర్, వైన్ లేదా మద్యం వంటి ఏ రూపంలోనైనా ఆల్కహాల్ తాగినప్పుడు లివర్ ఆల్కహాల్‌ను అసిటాల్డిహైడ్‌గా, ఆపై అసిటేట్‌గా మారుస్తుందని.. అసిటాల్డిహైడ్‌ అనేది ప్రమాదకరమని.. శరీర కణాలకు విషంతో సమానమని అంటున్నారు డాక్టర్లు. ఇది DNAను కూడా దెబ్బతీస్తుందని అంటున్నారు.

లిమిట్ గా ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని ఏ పరిశోధనలో తేలలేదని అంటున్నారు డాక్టర్లు. దశాబ్దాలుగా మద్యం సేవించేవారు.. మద్యం అలవాటు లేనివాళ్లకంటే ఎక్కువ కాలం జీవించినట్లు కొన్ని పరిశోధనల్లో తేలిందని, దీనివల్ల మితంగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న ప్రచారం మొదలైందని అంటున్నారు.

ALSO READ : సింక్‌లో ఏం వేయకూడదు? పొరపాటున కూడా సింక్‌లో వేయకూడనివి ఏంటంటే..

మొత్తం మీద మద్యం అనేది రోజు తీసుకున్నా, అప్పుడప్పుడూ తీసుకున్నా ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు. లిమిట్ గా ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఎక్కడా, ఏ పరిశోధనలో తేలలేదని చెబుతున్నారు. అయితే.. రోజూ మందు సేవించేవారు త్వరగా మంచాన పడి షెడ్డుకు పోతారు, అప్పుడప్పుడూ తాగేవారు కాస్త ఆలస్యంగా పోతారు అంతే తేడా.