టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న రష్మిక.. విజయ్ను పెళ్లి చేసుకోవాలని తాను వందసార్లు అడిగానని చెప్పిన మాటలు కొందరు నెటిజన్ల ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. దీంతో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు విజయ్ దేవరకొండ గట్టిగానే బదులిచ్చారు. రష్మికతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ వీడియో, ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఘాటైన నోట్ రాసుకొచ్చారు. మరోవైపు రష్మిక సైతం ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
రష్మిక నా భార్య.. నా సర్వస్వం: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ పోస్ట్ చేస్తూ.. ‘‘నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా సర్వస్వం ఆమె. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఆమె ఒకరు. మా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆమె నా జీవితంలో ఉండటం నా అదృష్టం. ఈ ప్రపంచమంతా మాకు వ్యతిరేకంగా నిలిచినా.. నేను తనతో కలిసి నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. నిజమైన ప్రేమను, సంతోషంగా జీవించడంలోని అందాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ నా ప్రేమాభిమానాలు. ఇక మిగిలిన వారందరికీ ఎలాంటి గౌరవం, మర్యాద చూపించాల్సిన అవసరం లేదన్నట్టుగా చెబుతున్నా.. పక్కకెళ్లి.. (f*** Themselves).. దేవరకొండ విజయ్ సాయి’’ అంటూ విజయ్ దేవరకొండ ఘాటైన క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది.
ప్రేమను వ్యక్తపరచడంలో తప్పేంటి?.. రష్మిక సూటి ప్రశ్న!
విజయ్ పోస్ట్‌కు తోడు రష్మిక స్పందన కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాను ప్రేమించిన వ్యక్తి కోసం వందసార్లు కాదు.. వెయ్యిసార్లు అయినా ప్రపోజ్ చేయడానికి సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రేమను వ్యక్తపరచడాన్ని ఆత్మగౌరవంతో ముడిపెట్టి విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
పెళ్లి అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని నిర్మించుకునే ప్రయాణమని రష్మిక పేర్కొన్నారు. తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన విజయ్ గురించి నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉందని, బయటి వ్యక్తుల విమర్శలు తన వ్యక్తిగత జీవితాన్ని శాసించలేవని స్పష్టం చేశారు. మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు ఇతరుల వ్యక్తిగత నిర్ణయాలను కూడా గౌరవించాలని సూచించారు.
తన ప్రేమపై వచ్చే విమర్శల కంటే, జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు అందించే మద్దతుకే ఎక్కువ విలువ ఇస్తానని రష్మిక పేర్కొన్నారు. తమ ప్రేమ ఇతరులు ఊహించుకున్నట్టుగా లేకపోయినా పర్వాలేదని, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో తాము కోరుకున్న అందమైన ప్రేమను ఆస్వాదించాలని రష్మిక చెప్పుకొచ్చారు.
సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన జంట..
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి టీమ్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా చర్చలకే పరిమితం కాకుండా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మొత్తానికి, తమ బంధంపై వస్తున్న విమర్శలకు విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించగా.. రష్మిక ప్రేమను వ్యక్తపరచడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ జంట చేసిన పోస్టులు, పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు చర్చించుకుంటుండగా, తమ ప్రేమ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉందనే సందేశాన్ని ఇద్దరూ స్పష్టంగా ఇచ్చారు. మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్లి ఆగుతుందనేది తెలియాల్సి ఉంది.
అసలు వివాదం ఎలా మొదలైందంటే?
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ‘కాఫీ విత్ కరణ్ 9’ షోలో రష్మిక తనను పెళ్లి చేసుకోవాలని వందసార్లు అడిగిందని విజయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో రష్మికనే ఈ బంధం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తోందంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ఈ విమర్శలపైనే విజయ్, రష్మిక తాజాగా ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
