హైదరాబాద్, వెలుగు: బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఏడాది మొదట్లో 10 గ్రాములు రూ.1.80 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి.. ప్రస్తుతం రూ.1.42 లక్షలకు దిగొచ్చింది. రికార్డు స్థాయిలో కిలో రూ.4 లక్షల మార్కును తాకిన వెండి.. రూ.2 లక్షల నుంచి రూ.2.19 లక్షలు ట్రేడవుతోంది. గత 60 రోజుల్లోనే వెండి ధరలు దాదాపు రూ.60 వేల వరకు పతనమయ్యాయి. ఇటు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడం, అటు రేట్లు తగ్గడంతో జనం మళ్లీ బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. దసరా నుంచి సేల్స్పెరుగుతున్నాయని, దీపావళికి మరింత ఊపందుకునే అవకాశముందని జ్యూవెలరీ వ్యాపారులు చెప్తున్నారు.
గోల్డ్షాపుల్లో మొదలైన సందడి
2 నెలల క్రితం రేట్లు భగ్గుమనడంతో జనం బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. వ్యాపారాలు 20 నుంచి 35 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం రేట్లు భారీగా దిగిరావడం, దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, దీపావళి వంటి పండుగలు దగ్గర పడటంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. పాత నగల మార్పిడితోపాటు కొత్త ఆభరణాలు, వెండి పూజా సామగ్రి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. భవిష్యత్తులో మళ్లీ ధరలు పెరిగే చాన్స్ఉందనడంతో బంగారం కొనుగోలు చేసి పెట్టుకోవాలనే ఆలోచనతో కస్టమర్లు గోల్డ్షాపులకు క్యూ కడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏడాది మొదట్లో పెరిగి.. ఇప్పుడు తగ్గి
ఈ ఏడాది ఆరంభంలో బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా గోల్డ్, సిల్వర్రేట్లు రికార్డు సృష్టించాయి. జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్రూ.1,75,000 నుంచి గరిష్టంగా రూ.1,80,000 మార్కును తాకింది. అటు కేజీ సిల్వర్ధర కూడా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, హెడ్జ్ ఫండ్స్ నుంచి వచ్చిన భారీ డిమాండ్‌తో రూ.3,85,000 నుంచి రూ.4,00,000 వరకు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో 24 క్యారెట్ల పసిడి కాస్త దిగొచ్చి, రూ.1,68,000 నుంచి రూ.1,72,000 మధ్య ట్రేడవ్వగా.. వెండి స్వల్ప ప్రాఫిట్ బుకింగ్‌తో రూ.3,50,000 నుంచి రూ.3,70,000 స్థాయికి చేరింది. నాటి గరిష్ట ధరలతో పోలిస్తే ప్రస్తుతం తులం బంగారం రూ.35 వేల నుంచి రూ.38 వేలకు పడిపోయింది. ఇక, వెండి అయితే 45 శాతం నుంచి 50 శాతం వరకు పతనమైంది. కేజీపై దాదాపు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తగ్గింది.
హైదరాబాద్‌లో వారం రోజులుగా
పసిడి, వెండి ధరలు(10 గ్రా. బంగారం, 1 కిలో వెండి)..
తేదీ 24 క్యారెట్ల గోల్డ్ 22 క్యారెట్ల గోల్డ్ వెండి
అక్టోబర్ 20 రూ.1,43,600 రూ.1,31,650 రూ.2,22,500
అక్టోబర్ 21 రూ.1,43,200 రూ.1,31,250 రూ.2,21,800
అక్టోబర్ 22 రూ.1,42,950 రూ.1,31,050 రూ.2,21,000
అక్టోబర్ 23 రూ.1,42,800 రూ.1,30,900 రూ.2,20,500
అక్టోబర్ 24 రూ.1,42,650 రూ.1,30,750 రూ.2,20,000
అక్టోబర్ 25 రూ.1,42,570 రూ.1,30,690 రూ.2,20,000
