లింక్లన్: న్యూజిలాండ్–ఎతో జరుగుతున్న తొలి అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ అద్భుతంగా పుంజుకుంది. దేవదత్ పడిక్కల్ (248 బాల్స్‌లో 24 ఫోర్లు, 3 సిక్స్‌లతో 199) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా.. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. దాంతో 106/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 488/8 స్కోరు చేసింది.
సాయి సుదర్శన్ (91)తో మూడో వికెట్‌కు 215, యష్ రాథోడ్ (66)తో ఐదో వికెట్‌కు 142 రన్స్ జోడించిన పడిక్కల్ అంపైర్ తప్పుడు నిర్ణయంతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 89వ ఓవర్‌లో గిబ్సన్ లెగ్ సైడ్ వేసిన బాల్‌ను ఆడేందుకు పడిక్కల్ ప్రయత్నించగా అది మిస్ అయ్యింది. కానీ బాల్ బ్యాట్ ఎడ్జ్ తాకిందని అంపైర్ ఔటిచ్చాడు. తీవ్ర అసహనంతో పడిక్కల్ గ్రౌండ్‌ను విడిచిపెట్టగా, రీ ప్లేలో బాల్.. బ్యాట్‌ను తాకలేదని తేలింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ (51 బ్యాటింగ్), అన్షుల్ కాంబోజ్ (23), అకిబ్ నబీ (38) మెరుగ్గా ఆడారు.
