రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ లీడ్ రోల్స్‌లో రూపొందుతున్న చిత్రం ‘అ’. సాయి బాలి దర్శకత్వం వహిస్తుండగా కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 30న సినిమాను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించిన మేకర్స్.. తాజగా రిలీజ్ డేట్ విషయంలో అప్‌డేట్ ఇచ్చారు.
నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ ‘ఇదొక మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేస్తాయి’ అని చెప్పాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉండబోతోందని, రాహుల్ విజయ్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలియజేశారు. జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి ఇందులో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
