నెట్ఫ్లిక్స్లో చిరు టాక్ షో: మెగావర్స్తో డిజిటల్ డెబ్యూ

నెట్ఫ్లిక్స్లో చిరు టాక్ షో: మెగావర్స్తో  డిజిటల్  డెబ్యూ

సంక్రాంతికి ‘కాకా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్న చిరంజీవి.. మరోవైపు ఓటీటీలోనూ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానున్న ఓ సెలబ్రిటీ టాక్‌‌షోతో ఆయన ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను ఇందులో ఆయన పంచుకోనున్నారు. 

ఈ షోకు ‘మెగావర్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌‌ను ఖరారు చేయబోతున్నట్టు సమాచారం. రెగ్యులర్‌‌‌‌ ఇంటర్వ్యూస్‌‌లా కాకుండా ‘ప్రాణం ఖరీదు’ మొదలు ఇప్పటివరకు తను ఎక్కడా వెల్లడించని విషయాలు, ఇంటరెస్టింగ్ ఇన్సిడెంట్స్‌‌తో పాటు పొలిటికల్‌‌ కెరీర్‌‌‌‌లోని కీలక ఘట్టాల గురించి ఇందులో ఆయన  వివరించబోతున్నట్టు తెలుస్తోంది. తన జీవితంలోని ఒడిదుడుకులతో పాటు  తెరవెనుక నిజాలను తెలియజేస్తూ,  నాణేనికి మరో కోణంలా దీనిని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

పలువురు సెలబ్రిటీస్‌‌ ఇందులో పాల్గొనబోతున్నారు.  ఆమధ్య నెట్‌‌ఫ్లిక్స్‌‌ కో-సీఈఓ టెడ్ సరండోస్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల దీనిని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.  గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టీవీ షోకు హోస్ట్‌‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి.. ఈ సెలబ్రిటీ షో ద్వారా డిజిటల్‌‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.