చెన్నై: తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత అన్బిల్ మహేశ్ పొయ్యమొళిని చెన్నై పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, గుర్తింపులు ఇప్పిస్తామని నమ్మించి, సుమారు రూ.100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఇలంగోవన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది.
డిజిటల్ పరికరాల నుంచి సేకరించిన సమాచారం, విచారణ సమయంలో నమోదైన స్టేట్మెంట్ల ఆధారంగా మాజీ మంత్రిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ వసూళ్ల పథకం కారణంగా సుమారు 177 ప్రైవేట్ పాఠశాలలు నష్టపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాగా, టీవీకే ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని డీఎంకే తీవ్రంగా మండిపడింది.
