CMRL మనీలాండరికంగ్ కేసులో కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు విచారణను తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 9 సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను విచారించిన జస్టిస్ కె.నటరాజన్, జస్టిస్ జాన్సన్ జాన్ లతో కూడిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యంతర ఉత్తర్వుతో విజయన్, ఆయన కుమార్తె వీణా టి, మాజీ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్‌లకు ఊరట లభించింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
కొచ్చిలోని సీఎంఆర్ఎల్, విజయన్ కుమార్తె వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అక్రమ ఆర్థిక లావాదేవీల జరిగినట్లు ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. కేసు విచారణ జరగుతుండగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది కేరళ హైకోర్టు.
