బ్రెజిల్ అధ్యక్షుడిగా మరోసారి లూలా..ప్రధాని మోదీ అభినందనలు

బ్రెజిల్ అధ్యక్షుడిగా మరోసారి  లూలా..ప్రధాని మోదీ అభినందనలు

న్యూఢిల్లీ: బ్రెజిల్​అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థిపై 44 లక్షల ఓట్లతో విజయం సాధించినట్లు అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఈ సందర్భంగా లూలా డా సిల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్​వేదికగా అభినందనలు తెలిపారు. తన మిత్రుడు లూలా విజయం అసాధారణమైనదని కొనియాడారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, విస్తరించేందుకు లూలాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.