రాష్ట్రపతి, ప్రధానితో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ

రాష్ట్రపతి, ప్రధానితో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: దేశరాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భార్య జనకి శుక్లాతో కలిసి గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ అంశాలతో పాటు, పలు విషయాలపై చర్చించినట్టు తెలిసింది.