ఇన్స్టాలో పరిచయం.. పెళ్లై ఏడాది కాలే.. విడాకులు ఇస్తలేదని భార్యపై పెట్రోల్ పోసి అంటిచ్చిన భర్త

ఇన్స్టాలో పరిచయం.. పెళ్లై ఏడాది కాలే.. విడాకులు ఇస్తలేదని భార్యపై పెట్రోల్ పోసి అంటిచ్చిన భర్త

గిసొంటి పెండ్లి ఎందుకు జేసుకుంటరో ఏందో గానీ.. లగ్గం అయ్యి ఏడాది గూడా దాటలే.. అంతల్నే భార్యను నిప్పంటిచ్చి సంపేశిండు  భర్త. బీహార్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆదివారం (అక్టోబర్ 25) ఉదయం సుపాల్ జిల్లాలో భర్త సంజీవ్ షా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో భార్య దామినీ కుమారి చనిపోయింది. కారణం ఏంటంటే విడాకులు ఇవ్వడం లేదని చెప్పాడు నిందితుడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దామినిని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి.. పెట్రోల్ పోసి అంటించి పారిపోయాడు సంజీవ్. మంటల్లో తగలబడుతూ పరిగెడుతున్న దామిని చూసిన స్థానికులు.. పోలీసులకు, అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పటికీ తీవ్ర గాయాలతో చనిపోయింది. 

విచారణలో నేరాన్ని అంగీకరించాడు నిందితుడు. కోసి ప్రాంతంలో బాటిల్ లో పెట్రోల్ నింపుకుని ఆ బాటిల్ ను దామిని బ్యాగులో దాచాడు. ఆ తర్వాత  బైసి రోడ్ లో 17 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు.  అప్పటికి ఉదయం 10 గంటలు అయ్యింది. లాల్మన్ పట్టి దగ్గర బైక్ ఆపి.. బాటిల్ లో ఉన్న పెట్రోల్ తీసి ఆమెపై పోసి అగ్గిపుల్లతో అంటిచ్చి పరారయ్యాడు. 

విడాకులకు అంగీకరించపోవడంతోనే చంపేసినట్లు చెప్పాడు సంజీవ్. ముజఫర్ పూర్ లో డివోర్స్ అప్లై చేశానని.. కానీ సంతకం పెట్టకపోవడంతోనే ఈ పనిచేసట్లు తెలిపారు. 

ఇన్ స్టా గ్రామ్ లవ్ స్టోరీ:

సంజీవ్, దామినీకి రెండేళ్ల క్రితం ఇన్ స్టాలో పరిచయం అయ్యింది. పరిచయం ప్రేమగా మారి 9 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చిందని.. ఆ తర్వాతి రోజే తన తల్లిగారి ఇంటికి వెళ్లిందని చెప్పాడు. అప్పుడప్పుడు దామినీని చూసేందుకు అత్తగారింటికి వెళ్లి వచ్చేవాడినని పోలీసులకు తెలిపారు. 

దీంతో  ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. చివరికి వివాహ బంధాన్ని తెంచుకోవాలని సంజీవ్ డిసైడయ్యాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు దామినీ నిరాకరించిందని తెలిపాడు. 

విచారణలో భాగంగా నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అతని తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులు తండ్రి పాత్ర లేనట్లు పోలీసులు భావిస్తున్నారు.