కేటుగాళ్లను, ట్రాప్ గాళ్లను పట్టుకుని కటకటాలకు పంపించే పోలీసు అధికారి సైతం హనీ ట్రాప్ లో పడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని 23 ఏళ్ల యువకుడు హనీ ట్రాప్ కు పాల్పడ్డాడు. మహిళ పేరుతో ట్రాప్ చేసి డబ్బులు గుంజేయటంతో అసలు విషయం బయటపడింది.
కేటుగాడిని 2026 అక్టోబర్ 19న అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిస్టులో నిందితుని లిస్టులో అనేక మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ లను సేకరించారు. నిందితుడిని 23 ఏళ్ల కొండభత్తుల పవన్ కుమార్ గా గుర్తించారు సైదాబాద్ పోలీసులు.
మహిళ పేరుతో చాటింగ్లు చేసి డబ్బులు డిమాండ్ చేయడం నిందితుడు నైజంగా పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి 20 లక్షల రూపాయలకు పైగా డబ్బు , ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు పవన్ హనీ ట్రాప్ వ్యవహారాల్లో ఆరితేరాడు. అమ్మాయిల పేర్లతో ఫేక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఓపెన్ చేసి.. పరిచయాలు పెంచుకుని యువకులతో చాటింగ్ చేయడం అలవాటు. చాటింగ్ పేరుతో నగ్న ఫొటోలు, వీడియోల సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుంటాడు.
నిందితుడు ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హనీట్రాప్‌కు పాల్పడినట్లు పోలీసుల వెల్లడించారు. నిందితుడి వలలో 82 మంది చిక్కినట్లు చెప్పారు. వెయ్యి మందికి పైగా బాధితులతో చాటింగ్ చేసినట్లు పోలీసుల గుర్తించారు.
హనీట్రాప్ ద్వారా ఇప్పటి వరకు రూ.18 లక్షల వసూలు చేశాడు పవన్. దీనికి తోడు పెట్టుబడులపై లాభాల పేరుతో మరో రూ.7.16 లక్షల మోసం చేశాడు. మొత్తం 25 లక్షల16 వేల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల ప్రకటనలో తెలిపారు.
ఇంటర్నేషన్ ట్రాపింగ్:
కేటుగాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హనీ ట్రాప్ కు పాల్పడుతున్నాడు. తెలంగాణతో పాటు ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల నుంచి బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా దుబాయ్, టర్కీ, పాకిస్థాన్, కెనడాకు చెందిన బాధితులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ALSO READ : కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కాఫర్ డ్యామ్ నిర్మించాలి..
పవన్ బాధితుల్లో వైద్యులు, వ్యాపారులు, లెక్చరర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 14 ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లతో ట్రాప్ చేస్తున్నట్లు చెప్పారు.
