సూపర్ స్టార్తో ఐదోసారి నయనతార

సూపర్ స్టార్తో ఐదోసారి నయనతార

తెలుగు,  తమిళ, మలయాళ  భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌తో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  రజినీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ‘ధర్మన్’  చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్టు  మేకర్స్ ప్రకటించారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో  రజినీకాంత్, నయనతార ఓ కిటికీ ముందు ఎదురెదురుగా నిలబడి షాడో లుక్‌‌లో  కనిపిస్తున్నారు.  వీరిద్దరూ కలిసి నటించడం  ఇది ఐదోసారి.  గతంలో  చంద్రముఖి,  కథానాయకుడు,  దర్బార్,  పెద్దన్న   సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ క్రేజీ పెయిర్‌‌‌‌పై  అభిమానుల్లో ఆసక్తి  నెలకొంది. 

 రజినీకాంత్ కెరీర్‌‌లో 173వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆయన డెడ్లీ డాక్టర్‌‌‌‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో  సిమ్రాన్, రాశీఖన్నా, శ్రీలీల, రామ్ పోతినేని  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.