తనదైన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి గుర్తింపును అందుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం చాప్టర్ 1’లో ఆమె నిత్యారెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు సోమవారం మేకర్స్ రివీల్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఆమె క్యారెక్టర్ గ్లింప్స్ ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయుడుపేట అమ్మాయిగా నిజాయితీగల యంగ్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఓం’ను లీడ్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో సాయిపల్లవి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంది.
ఫస్ట్ టైమ్ పోలీస్ యూనిఫామ్‌లో కనిపించడం ఆమె పాత్రపై ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ‘ఓం ఫస్ట్ స్ట్రైక్’, మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
