కోలీవుడ్ స్టార్ సూర్య నుంచి రాబోతున్న చిత్రం ‘సీన్’. నజ్రియా నజీమ్ హీరోయిన్. మలయాళంలో రోమాంచం, ఆవేశం లాంటి చిత్రాలతో మెప్పించిన జితు మాధవన్ దీనికి దర్శకత్వం వహించాడు. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషించారు.
సోమవారం ఈ చిత్రం నుంచి హీరో సూర్య పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఎంతో సీరియస్ కేసును కూడా చాలా క్యాజువల్‌గా హ్యాండిల్ చేసే డీఎస్పీ ప్రేమ్ రాజ్ పాత్రలో ఆయన కనిపించారు. చివర్లో మరో గెటప్‌లో సీరియస్‌గా కనిపించడం సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మరోవైపు దుబాయ్‌లో ఈ మూవీ ఈవెంట్ నిర్వహించారు.
డైరెక్టర్ జితు మాధవన్‌తో కలిసి పనిచేయాలనేది తన చిరకాల కోరిక అని సూర్య ఈవెంట్‌లో చెప్పారు. సాధారణంగా ఎవరైనా కథ చెప్పేటప్పుడు శ్రద్దగా వినే తాను, ఈ స్టోరీ వినేటప్పుడు మాత్రం మొదలుపెట్టిన ఐదు నిమిషాలకే నవ్వు ఆపుకోలేకపోయానని అన్నారు. సెట్స్‌లో అడుగుపెట్టగానే కెరీర్ కొత్తగా మొదలుపెట్టిన ఫీలింగ్ కలిగిందని, రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా మరో వరల్డ్‌లోకి తీసుకెళ్లేలా ఇది ఉంటుందని సూర్య వివరించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భార్య జ్యోతికతో కలిసి ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
