నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఒక సరికొత్త నేపథ్యంలో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇందులో ఆయన డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నాడు. దీనికోసం ఆయన మ్యాసీవ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, బీటీఎస్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
