భోగి డబ్బింగ్ డన్.. అనుపమ స్పెషల్ వీడియో వైరల్

భోగి డబ్బింగ్ డన్.. అనుపమ స్పెషల్ వీడియో వైరల్

రీసెంట్‌‌గా ‘క్రేజీ కళ్యాణం’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుపమ పరమేశ్వరన్.. చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో  ఒకటి ‘భోగి’. ఈ సినిమాలో  ఆమె  శర్వానంద్‌‌కు  జంటగా నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కందుల సులోచన  రాణిగా అనుపమ కనిపించనుంది. 

ఇప్పటికే విడుదలైన తన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంది.  తాజాగా అనుపమ  తన పాత్రకు సంబంధించిన  డబ్బింగ్ పూర్తి చేసింది.  ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో ఈ కథ  సాగుతుంది.  ఆనాటి  తెలంగాణ మాండలికంలోని డైలాగ్స్‌‌ ఆమె చెప్పడం  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.  

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌‌ తో పాటు డింపుల్ హయాతి మరో హీరోయిన్‌‌గా నటిస్తోంది.   భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 12న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.