విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ను పెళ్లి చేసుకోవాలని తాను వందసార్లు అడిగానని ఇటీవల ఓ షోలో పాల్గొన్న రష్మిక చెప్పిన మాటలపై కొందరు నెటిజన్లు విమర్శలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ట్రోలింగ్‌పై రియాక్ట్ అయిన రష్మిక.. సుదీర్ఘమైన పోస్టుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ప్రేమను వ్యక్తపరచడంలో తప్పేమీ లేదని, తాను ప్రేమించిన వ్యక్తి కోసం వందసార్లు కాదు.. వెయ్యి సార్లు అయినా ప్రపోజ్ చేయడానికి సిద్ధమేనని తెలియజేసింది. ‘పెళ్లి అంటే కేవలం ఒక వేడుక కాదు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని నిర్మించుకునే ప్రయాణం. నా కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన విజ్జు (విజయ్ దేవరకొండ) గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకే ఉంది. బయటివారి విమర్శలు నా వ్యక్తిగత జీవితాన్ని నిర్దేశించలేవు. ముఖ్యంగా, మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు ఇతరుల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలి.
ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది వ్యక్తిగత నిర్ణయం.. దాన్ని ఆత్మగౌరవంతో ముడిపెట్టి విమర్శించడం సరికాదు. నా ప్రేమపై వచ్చే విమర్శల కంటే, నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు ఇచ్చే మద్దతుకే విలువ ఇస్తా. మా ప్రేమ ఇతరులు ఊహించుకున్న విధంగా లేకపోయినా ఇబ్బంది లేదు. మీ జీవితంలో మీరు ఊహించుకున్న అందమైన ప్రేమను ఆస్వాదించండి’ అని పోస్ట్ చేసింది. మరోవైపు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజయ్, రష్మికల టీమ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
