ఘట్‌కేసర్, వెలుగు: ఘట్‌కేసర్ పరిధిలోని ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఉప్పల్‌భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ సి. ప్రవీణ్ కుమార్ కొడుకు కృష్ణ కౌండిన్య (21) బీటెక్ పూర్తి చేశాడు. ఆదివారం తన స్నేహితుడు ఘన్‌కోట్ రిషబ్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అయితే, కృష్ణ కౌండిన్య అపస్మారక స్థితిలో పడిపోయాడని రిషబ్.. ప్రవీణ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
వెంటనే అతడిని ఘట్‌కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానాలున్నాయని ప్రవీణ్పోలీసులకు ఫిర్యాదు చేశారు.
