- గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023’ (ఎంఎస్ఎంఈఆర్– 2 023)ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. ఈ మేరకు అధికారికంగా డీ-నోటిఫై చేస్తూ గెజిట్ను రిలీజ్ చేసింది. 2023 సెప్టెంబర్ 19న తీసుకొచ్చిన ఈ నిబంధనలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎన్ఎంసీ ప్రకటించింది.
ఈ రెగ్యులేషన్లను రద్దు చేసినా.. మెడికల్ కాలేజీలు యాన్యువల్ డిస్క్లోజర్ రిపోర్టును కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎన్ఎంసీ యాక్ట్–2019లోని సెక్షన్ 24(ఐ), 25(హెచ్) ప్రకారం కాలేజీల వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ఈ రద్దు నిర్ణయం కంటే ముందు పాత నిబంధనల కింద తీసుకున్న చర్యలు, ఇచ్చిన అనుమతులు, రెన్యువల్స్, జారీ చేసిన ఆర్డర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. అప్పటికే పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు, అప్పీళ్లు, విచారణలు పాత నిబంధనల ప్రకారమే పరిష్కారమవుతాయని చేసింది.
